పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. పంజాబ్ మాజీ పేసర్, విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) కన్నుమూశారు. 2007లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అమన్‌ప్రీత్‌, పంజాబ్ తరఫున 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశారు. 2008 తొలి ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆయన మృతిపై యువరాజ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, “చాలా నిశ్శబ్దంగా ఉండి కష్టపడి పనిచేసే క్రికెటర్ ఇకపై మన మధ్య లేరు” అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్