'రేమండ్' మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ కన్నుమూత

ప్రముఖ వస్త్ర బ్రాండ్ రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత విజయ్‌పత్ సింఘానియా (87) కన్నుమూశారు.  శనివారం సాయంత్రం ముంబైలోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు, రేమండ్ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ గౌతమ్ సింఘానియా ధ్రువీకరించారు. ఈరోజు ముంబైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1980లో రేమండ్ ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన విజయ్‌పత్.. 20ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా సాహసవంతుడైన ఏవియేటర్‌గానూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్