మాజీ సర్పంచ్ దారుణ హత్య!

TG: మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. యాకయ్య మంగళవారం రాత్రి తన ఇంటి ముందు నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్