ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో 58 ఏళ్ల మాజీ సైనికుడు షంషుద్దీన్, ఆయన భార్య సడ్డో బేగం ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యుల సాయంతో తలుపులు తెరిచి చూడగా దంపతులు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యలకు కారణం తెలియాల్సి ఉండగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.