కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ ఇవాళ (మంగళవారం) కన్నుమూశారు. కోజికోడ్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. 89 సంవత్సరాల వయస్సులో ఆయన తుది శ్వాస విడిచారు. వీపీ సింగ్‌ మంత్రి వర్గంలో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిగా కేపీ ఉన్నికృష్ణన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్