బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గోపాలన్‌ నంబియార్‌ కన్నుమూత

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ బీపీఎల్ ​​వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్ (95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు కారణంగా గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు నంబియార్ అల్లుడు, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. గోపాలన్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్