ఒకే నంబర్ ప్లేట్‌తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే!

TG: హైదరాబాద్‌లో ఒకే నంబర్ ప్లేట్ (TS34C1858) తో నాలుగు బైకులు రోడ్లపై తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆశ్చర్యపోయారు. చలాన్లు మాత్రం ఒకే వ్యక్తి బేగరి గోపాల్ పేరు మీద పడుతుండటంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తన బైక్‌పై పలు చలాన్లు ఉండగా అనుమానంతో పరిశీలించి, అవి తనవి కావని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో ఒకే నంబర్ ప్లేట్‌తో నాలుగు బైకులు ఉన్నట్లు నిర్ధారించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్