AP: ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం బీచ్‌కు గురువారం ఉదయం ఒక బోటు కొట్టుకొచ్చింది. ఈ బోటులో నాలుగు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ బోటు చెన్నైకి చెందినదిగా ప్రాథమిక సమాచారం. బోటులో మొత్తం 15 మంది మత్స్యకారులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సముద్ర అలల ఉధృతికి బోటు దారి తప్పి తీరానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.