AP: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన చిన్నారులు అందరూ 15 ఏళ్ల లోపు వారే. ఫైర్ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.