తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు!

తెలంగాణకు భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు చేసింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేటి నుంచి శనివారం వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం మధ్య తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని, పలుచోట్ల వడగళ్ల వాన కూడా పడొచ్చని IMD హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్