కర్ణాటకలోని రాయచూర్‌లో ఇటీవల మటన్ తిని ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు. సిర్వార్ తాలూకా కల్లూరు గ్రామంలో భీమన్ (60) కుటుంబం నివసిస్తోంది. ఇటీవల వారు కుటుంబం అంతా మటన్ కర్రీ తిన్నారు. కాసేపటికే నేలపై పడిపోయారు. గ్రామస్థులు చూసేసరికి వారి నోట్లోంచి నురగలు వచ్చాయి. నలుగురు చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.