బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన నలుగురు మృతి

ముంబయిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అబ్దుల్లా (40), భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13)లకు వాంతులు, విరేచనాలు మొదలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు ఫుడ్ పాయిజనింగ్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పుచ్చకాయ నమూనాలను పరీక్షలకు పంపగా, మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. తుది నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్