ఢిల్లీలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో ఉదయం 7 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో అందులో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.