బోర్‌వెల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి (వీడియో)

హర్యానాలోని అంబాలా జిల్లా ధనేరా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం పొలంలో ఆడుకుంటూ తెరిచి ఉన్న బోర్‌వెల్‌లో నిర్వైర్ సింగ్‌ (4) పడిపోయాడు. దీంతో బాలుడిని రక్షించేందుకు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సుమారు 21 గంటలు శ్రమించాయి. బుధవారం తెల్లవారుజామున బాలుడిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు నిరుపయోగ బోర్‌వెల్‌లను మూసివేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్