రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి

AP: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. టెక్కలి సమీపంలో బహిర్భూమికి వెళ్లిన ఐదుగురు యువకులను రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕