ఆక్లాండ్ వేదికగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, మయాంక్ అగర్వాల్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు, చివరి రెండు మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.