గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌కి 14 రోజుల రిమాండ్

TG: హైదరాబాద్‌లో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి భారీ మోసాలకు పాల్పడిన గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నారాయణగూడ పోలీసులు అతడిని శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. హయత్ నగర్‌కు చెందిన కృష్ణ చారి అనే బంగారు ఆభరణాలు తయారుచేసే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి, రూ. 30 లక్షలు తీసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్