కాల్‌బాయ్‌గా ఆశ చూపి కోట్లు దండుకున్న సైకో అరెస్ట్

గుంటూరు పోలీసులు చైతన్య కృష్ణ అనే మోసగాడిని అరెస్ట్ చేశారు. ఇతను మహిళల పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి, యువకులను కాల్‌బాయ్‌గా పనిచేయిస్తానని నమ్మించి, రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసేవాడు. ఆ తర్వాత పోలీసులమని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఆరు నెలల క్రితం 68 ఏళ్ల వృద్ధుడిని కూడా ఇలాగే మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. ఇతను తెలంగాణలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు, ఇప్పటివరకు కోటి రూపాయల వరకు మోసం చేసినట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్