తెలంగాణలోని క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, యువతకు మోటార్ బైక్‌లు, ఈ-బైక్‌లు, స్కూటీలు, అలాగే చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించనుంది. 21–55 ఏళ్ల (కుట్టు మిషన్/వ్యాపారాలు), 21–50 ఏళ్ల (బైక్‌లు) క్రైస్తవ మైనారిటీలు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు ఉండాలి. జులై 18 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.