దేశంలోని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ఫిబ్రవరి 15, 2024 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. దీనికి కేంద్రం భారీ సబ్సిడీ అందిస్తోంది, 1 నుంచి 7 కిలోవాట్ల ప్లాంట్లకు రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. భారతీయ పౌరులు, సొంత ఇల్లు, విద్యుత్ కనెక్షన్ ఉన్నవారు అర్హులు. pmsuryaghar.gov.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలి. 30 రోజుల్లో సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.