బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, మహాగఠ్‌బంధన్ కూటమి 'తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్' పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టోలో, అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామని తేజస్వీ యాదవ్ అన్నారు.