అమృత్సర్కు చెందిన వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాకేష్ ట్రెహాన్ ‘రాజా డీ కింగ్’గా పిలవబడుతున్నారు. తాజాగా ప్రజలకు ఉచితంగా ఐఫోన్లు అందించే ‘ఐఫోన్ లంగర్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 22న చండీగఢ్, మొహాలీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఐఫోన్ 17 లేదా అంతకంటే కొత్త మోడళ్లను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 100 ఐఫోన్లు ఆర్డర్ చేశామని, అవసరమైతే 1,000 వరకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజేతలను వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎంపిక చేయనున్నారు.