సర్కారు కాలేజీ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా 194 పేజీల 12 లాంగ్ నోట్‌బుక్స్ పంపిణీ చేసింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ నోట్‌బుక్స్ పంపిణీ పూర్తయింది. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు సుమారు వెయ్యి రూపాయల ఆర్థిక భారం తప్పింది. ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఈ నోట్‌బుక్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మొత్తం 24 లక్షల నోట్‌బుక్స్ పంపిణీ పూర్తయింది.

సంబంధిత పోస్ట్

✕
✕