పాక్ మీడియా దుష్ప్రచారానికి ఫ్రాన్స్ నావికాదళం చెక్

పాకిస్థాన్ మీడియా 'ఆపరేషన్ సిందూర్‌' సమయంలో భారత వైమానిక దాడుల్లో పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించిందని, భారత్ రఫేల్ విమానాలను కోల్పోయిందని ఫ్రాన్స్ నౌకాదళ అధికారిని ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. అయితే, ఈ వార్తను ఫ్రాన్స్ నావికాదళం ఖండించింది. ఇది తప్పుడు సమాచారమని, కథనంలో పేర్కొన్న అధికారి పేరు, పదవి కూడా తప్పని, ఆయన భారత విమానాలు కూలిపోయాయని ధ్రువీకరించలేదని, చైనా జే10ల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పాక్ మీడియా భారత వ్యతిరేక ప్రచారాన్ని బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ఖండించారు.

సంబంధిత పోస్ట్