ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. ప్రపంచ నంబర్-1 అన్ సెయంగ్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో తొలి గేమ్‌ను 21-16తో కైవసం చేసుకుంది. ఒక దశలో 20-14తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. కీలక పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు అన్ సెయంగ్‌తో 10 సార్లు తలపడిన సింధు.. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఫైనల్‌లో తొలి గేమ్ విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో గేమ్‌లోనూ ఇదే జోరు కొనసాగించి టైటిల్ గెలవాలని సింధు పట్టుదలగా ఉంది.