భార్యతో స్నేహితుడు మాట్లాడాడని.. స్నేహితుడినే హత్య చేశాడు

TG: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. తన భార్యతో స్నేహితుడు సల్మాన్ (23) స్నేహంగా మాట్లాడుతున్నాడని అనుమానించిన అబ్దుల్లా, మరికొంత మంది స్నేహితులతో కలిసి సల్మాన్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలైన సల్మాన్, ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 23న రాత్రి జరిగిన ఈ ఘటనలో పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అబ్దుల్లాతో పాటు సహకరించిన స్నేహితులను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్