TG: భువనగిరి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. జనగామ జిల్లా శాతపురం గ్రామానికి చెందిన గన్న ఆనంద్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన రాకేష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాకేష్ అమ్మమ్మ ఊరు శాతపురం కావడంతో చిన్ననాటి నుంచే అక్కడే పెరిగాడు. ఈ క్రమంలో ఆనంద్ తో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ హైదరాబాద్ లో ఉంటున్నారు. శుక్రవారం ఆనంద్ పుట్టినరోజు కావడంతో ఇద్దరు శాతపురం వచ్చి.. తిరిగి బైక్ పై హైదరాబాదు వెళ్తుండగా ప్రమాదం జరిగి చనిపోయారు.