మే 1వ తేదీన మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్‌గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది. ఈ నిర్ణయం ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానుంది.