ఇకపై పేరు వాడితే చర్యలే.. ఎన్టీఆర్ టీమ్ కీలక ప్రకటన

ఇకపై జూనియర్ ఎన్టీఆర్ పేరును అనధికారికంగా, వాణిజ్య ప్రకటనల కోసం లేదా వ్యక్తిగతంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో టార్గెట్ చేసినా చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. హైకోర్టు తీర్పును గుర్తు చేస్తూ, "NTR", "Jr. NTR", "Tarak", "Man of Masses", "Young Tiger" వంటి పేర్లు, బిరుదులను కూడా అనధికారికంగా ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఫోటోలను దురుద్దేశంతో మీమ్స్, ఏఐ జనరేటెడ్ కంటెంట్, మార్ఫ్డ్ ఇమేజెస్ ద్వారా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్