AP: ఆనందపురం హైవేపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశాఖలోని ఓ ఆస్పత్రిలో పండు చికిత్స పొందుతున్నాడు. పండు మాస్టర్ రెండు కాళ్లు డ్యామేజ్ అయ్యాయని, నడుము వద్ద తుంటి ఎముక సైడ్ అవ్వడంతో వైద్యులు సరి చేస్తున్నారని డ్యాన్స్ మాస్టర్ వెంకట్ తెలిపారు. పండుకి వాంతులు అవ్వడంతో కారులోంచి బయటకు దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.