పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రమైంది. దీని ప్రభావంతో క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది, రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కారణంగా క్యూబాలో ఇంధన సరఫరా నిలిచిపోయింది, పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఈ సంక్షోభం క్యూబాలో ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూతపడేలా చేసింది.