ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన పనామా కాలువ సమీపంలో ఇంధన నౌకలో భారీ పేలుడు సంభవించింది. అమెరికాస్ వంతెన కింద ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, సమీపంలోని ఇతర నౌకలకు మంటలు వ్యాపించకుండా నివారించారు. ఈ ప్రమాదం వల్ల కాలువలో నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.