కేంద్ర పథకాల నిధులను సమర్థంగా వినియోగించుకోవాలి: భట్టి విక్రమార్క

TG: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర పథకాల నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని, వాటిని పూర్తి స్థాయిలో రాబట్టేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరాలని, ఇందుకోసం కేంద్ర శాఖలతో నిరంతర సమన్వయం చేసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕