తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొక్కజొన్న కొనుగులుకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో లక్ష మంది రైతుల ఖాతాల్లో రూ.1,173కోట్లు జమ కానున్నట్లు తెలిపారు. మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందన్నారు. ఇప్పటికే 14లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు వెల్లడించారు.