మధ్యాహ్నం 3:30 గంటలకు కోట అంత్యక్రియలు

లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. తన నటనతో ప్రేక్షక లోకాన్ని కట్టిపడేసిన ఆయన ఇకలేరని తెలియడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 750పైగా చిత్రాల్లో నటించిన కోట ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని పలువురు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. కాగా కోట అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్