చనిపోయిన ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు

TG: ఓ వ్యక్తి చనిపోయిన ఐదేళ్ల తర్వాత అతడి అంత్యక్రియలు జరిగాయి. కరీంనగర్ మెట్‌పల్లికి చెందిన శ్రీపాద నరేశ్(40) బహ్రెయిన్ వెళ్లి 2020 మేలో మృతి చెందారు. అయితే మృతదేహం అయిదేళ్లుగా అక్కడి మార్చురీలోనే ఉండిపోయింది. ఈ విషయం ఇటీవల కుటుంబసభ్యులకు తెలిసింది. అక్కడే దహన సంస్కారాలకు సమ్మతిస్తూ మృతుడి భార్య లత సంతకం చేయగా.. నరేశ్ సోదరుడు ఆనంద్ బహ్రెయిన్ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్