దర్శకుడు అనుదీప్ కేవీ తన వెరైటీ కామెడీతో 'జాతి రత్నాలు'తో సంచలనం సృష్టించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న 'ఫంకీ' సినిమా ప్రమోషన్ బాధ్యతను అనుదీప్ తన భుజాలపై వేసుకున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదలకానుంది. గతంలో 'ప్రిన్స్' సినిమాతోనూ అనుదీప్ ఇంటర్వ్యూలలో నవ్వించినా, కంటెంట్ తేలిపోవడంతో ఫలితం తారుమారైంది. 'ఫంకీ' బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే నవ్వులతో పాటు కథలో బలం ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.