ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. 37 ఏళ్ల రికార్డు బద్దలు

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మిక్స్‌డ్ డబుల్స్‌లో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ సంచలనం సృష్టించింది. ఈ జోడీ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుని, 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్‌ పగ్‌ జోడీ ఈ ఘనత సాధించింది. మార్గరెట్‌ కోర్ట్‌-కెన్‌ ఫ్లెచర్‌ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్‌ టైటిళ్లు సాధించిన రెండో జోడీగా గడెకీ-పియర్స్ చరిత్ర సృష్టించింది. రాడ్‌ లేవర్‌ ఎరీనాలో జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్‌ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్