జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలం పెద్దధన్వాడ గ్రామానికి చెందిన 2వ వార్డు సభ్యులు రంగన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, రంగన్న శుక్రవారం స్వగృహానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రంగన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.