తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అలంపూర్ మున్సిపల్ పరిధిలో నామినేషన్ల కోసం అధికారులు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.