పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన కెనడా వైద్యుడు శివారెడ్డి వెంకటకృష్ణారెడ్డి పెళ్లి కోసం ఇండియాకు వస్తుండగా ఖతార్‌లో విమానం నిలిచిపోయింది. మూడు రోజులుగా అక్కడే చిక్కుకుపోయిన అతడి తల్లిదండ్రులు ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేకమంది తెలుగువారు స్వదేశానికి తిరిగి వస్తున్నారు.