భారీగా కురుస్తున్న వర్షాలకు అలంపూర్ నియోజకవర్గంలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మానవపాడు-అమరవాయి, మానవపాడు-గోకులపాడు గ్రామాల మధ్య ఉన్న వాగుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజ మండలం దేవబండ గ్రామానికి సంబంధించిన వాగు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి