జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన నాయక భీమ్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం అలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు రూ. 5 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాన్నిశుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా భీమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.