మాజీ సర్పంచ్ సుదర్శనమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండల కేంద్రంలో ఉత్తనూర్ గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి తల్లి సుదర్శనమ్మ కిడ్నీ సమస్యతో కర్నూలులోని దీపక్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి సుదర్శనమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెకు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕