వెంకటన్న గౌడ్ ఆరోగ్య వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్సీ చల్లా

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటన్న గౌడ్ అనారోగ్యంతో కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓమిని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕