శాంతినగర్ పట్టణంలోని శ్రీనివాస డిఎల్ఈడి కాలేజీలో బుధవారం నాడు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. మాక్ అసెంబ్లీ లో రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీలు పోటాపోటీ గా చర్చలు కొనసాగాయి. మాక్ అసెంబ్లీలో ప్రశ్నావళి సమయంలో నిజమైన అసెంబ్లీని తలపించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నిజమైన రాజకీయ పరిజ్ఞానం తెలుస్తుందని ఉపాధ్యాయురాలు శోభిత ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.