జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ లోని 7వ వార్డు జమ్మలమడుగు ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా బుధవారం AI స్టెతస్కోప్ హార్ట్ చెకప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ పాల్గొని గుండె పరీక్ష చేయించుకున్నారు. వైద్యులు AI స్టెతస్కోప్ ద్వారా శ్రీనివాసులు గారికి హృదయ పరీక్ష నిర్వహించారు.