దేవరకద్ర: పాఠశాలలో వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం కొన్నూర్ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్, వాల్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలను శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో సొంత నిధులతో మౌలిక వసతులు కల్పించిన కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, తదితర దాతలను అభినందించారు. బీఆర్ఎస్ పాలనలో పాఠశాలలో మౌలిక వసతులను పట్టించుకోలేదని, పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదన్నారు.

సంబంధిత పోస్ట్