దేవరకద్ర: కురుమూర్తి జాతరకు 179 ప్రత్యేక బస్సులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం, అతిపెద్ద జాతర ఐన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నవంబర్ 7, 8, 9 తేదీలలో మొత్తం 179 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్, జోగులాంబ గద్వాల నుంచి బస్సులు నడపనుండగా, జాతరకు వెళ్లే భక్తుల కోసం బస్టాండ్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్