కొత్తకోట మండలం మిరాస్ పల్లిలో నిర్వహించిన భూభారతి సదస్సుకు శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. అనంతరం వడ్డెర, యాదవ సంఘం కాంపౌండ్, కురువ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులు తెలుగు బాలమ్మ ఇందిరమ్మ ఇంటి భూమి పూజలో పాల్గొని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.